31 August, 2026 | 9:31 AM

Breaking News

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి   •   క్రీడా స్ఫూర్తితో గెలపోటములను స్వీకరించాలి: ప్రాజెక్టు అధికారి రాహుల్   •   చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి   •   ఆదివాసి యువతి శిరీష కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి   •   యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం   •   యావాపూర్ లో ఘనంగా బోనాలు   •   అత్యంత వైభవంగా బోనాల పండుగ   •   సాంబ శర్వాణి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి   •   ఉమ్మడి మానాలలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   •   కౌకూర్ మోడల్ మార్కెట్ భవనం కోసం నాలుగో రోజు ధర్నా   •  

ఐపీఎల్‌కు కార్తిక్ వీడ్కోలు

24-05-2024 12:19 AM

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు (ఐపీఎల్) వీడ్కోలు పలికాడు. రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తనకు ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే కార్తిక్ ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. కాగా ఐపీఎల్‌లో కార్తిక్ బెంగళూరుతో పాటు కోల్‌కతా, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్‌లో కార్తిక్ బెంగళూరు తరపున 15 మ్యాచ్‌లాడి 326 పరుగులు సాధించాడు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో 257 మ్యాచ్‌లాడి 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్థశతకాలు ఉన్నాయి. కాగా రాజస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం బెంగళూరు జట్టు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.