31 August, 2026 | 10:35 AM

Breaking News

నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •  

రేపే పాలిటెక్నిక్ పరీక్ష

23-05-2024 09:50 PM

హైదరాబాద్: రేపే రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ (పాలీసెట్) పరీక్ష జరగనుంది. తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజిల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ - 2024 పరీక్షకు సర్వం సిద్ధమైంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని ఈమేరకు అధికారులు సూచించారు. రాష్ట్రంలో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకుగానూ పాలీటెక్నిక్ ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఎంపిసి, బైపిసి విద్యార్థులు మొత్తం 92,808 మంది హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు సంబంధించి మొత్తం 259 ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు.