క్వార్టర్స్‌కు సింధు
మలేషియా మాస్టర్స్
కౌలాలంపూర్: భారత ఏస్ షట్లర్ పీవీ సింధు కమ్‌బ్యాక్‌లో తన స్థాయి ప్రదర్శనతో అదరగొడుతోంది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింధూ 21 12 21 కొరియాకు చెందిన సిమ్ యూను మట్టి కరిపించింది. 59 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధూ విజయం అందుకోవడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. మాజీ చాంపియన్ సిమ్ యూ నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. తొలి గేమ్‌ను సింధూ 21 గెలుచుకున్నప్పటికి రెండో గేమ్‌ను 12 సిమ్ యూకు కోల్పోయింది. అయితే మూడో గేమ్‌లో ఫుంజుకున్న సింధు తన అనుభవాన్ని అంతా రంగరించి 21 గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక సింధు క్వార్టర్స్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ హాన్ యూను ఎదుర్కోనుంది.ముఖాముఖి పోరులో సింధూ 5 పైచేయిలో ఉంది. మరో సింగిల్స్‌లో అష్మిత చలీహా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో అష్మిత 21 16 21 అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్‌ను చిత్తు చేసింది. సూపర్ 500 ఈవెంట్‌లో అష్మిత క్వార్టర్స్‌కు చేరడం ఇది రెండోసారి. ఇక అష్మిత క్వార్టర్స్‌లో చైనాకు చెందిన జాంగ్ మాన్‌తో తలపడనుంది. మిగతా విభాగాలకు వస్తే పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ ప్రిక్వార్టర్స్‌కు పరిమితమయ్యాడు. మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి సిమ్రన్ సింగీ టక్కర్ జోడీలు పరాజయం చవి చూశాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి జంట ప్రిక్వార్టర్స్‌లో ఓటమిపాలైంది.






