05-11-2025 09:24:33 AM
నేడు కార్తీక పౌర్ణమి..
ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కార్తీక పౌర్ణమి(Kartika Purnima 2025) వేడుకలు జరుగుతున్నారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాచలంలోని పవిత్ర గోదావరి నది(Godavari River) వద్ద భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం భక్తులతో రద్దీగా మారింది. గోదావరిలో స్నానాలు ఆచరిస్తూ భక్తులు కార్తికదీపాలు వదులుతున్నారు. నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. దేవరకొండ మార్కండేయ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయం(Vemulawada Sri Raja Rajeswara Swamy Temple) భక్తులతో రద్దీగా మారింది. కార్తీక పౌర్ణమి పర్వాదినాన శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రముఖ శివాలయాలకు భక్తులు పోటెత్తారు. నల్గొండ ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి ఎరకేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మేళ్ల చెరువు స్వయంభూ శంభూ లింగేశ్వరస్వామి ఆలయంలో భక్తలు రద్దీ పెరిగింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రార్థనలు చేశారు. కార్తీక పౌర్ణమి రోజున ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.