calender_icon.png 5 November, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు

05-11-2025 08:25:57 AM

బెజ్జుర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని శివాలయం, శ్రీ రంగనాయక స్వామి, హనుమాన్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శివాలయంలో ప్రధాన అర్చకులు గురుదత్ ఆధ్వర్యంలో అభిషేకం, అర్చనలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తులు 365 వత్తులను వెలిగించి ముగ్గులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో భక్తులతో ఆలయాలు  కిట కిట లడాయి.