07-12-2025 01:24:05 AM
హైదరాబాద్‌కు చేరుకున్న‘సేవ్’ కార్ ర్యాలీ
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కాశీ తమిళ్ సంగమం (కేటీఎస్) 4.0లో భాగంగా నిర్వహిస్తున్న సేజ్ అగస్త్య వెహికిల్ ఎక్స్పెడిషన్ (సేవ్) తమిళ, భారతీయ నాగరికతలో లోతుగా స్థిరపడిన ప్రా చీన మార్గాన్ని అనుసరిస్తూ జరుగుతున్న చారిత్రక కార్ ర్యాలీ శనివారం హైదరాబాద్ చేరుకుంది. సేవ్ బృందానికి ఏబీవీపీ హైదరాబాద్ మహానగర్ కార్యకర్తలు, చిరిగే శివకుమార్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఏబీవీపీ సౌత్ సెంట్రల్ జోన్), ప్రుత్వీ తేజ (సిటీ సెక్రటరీ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్)ల నేతృ త్వంలో స్వాగతం పలికారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ మాట్లాడు తూ.. యాత్ర విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.వివిధ రాష్ట్రాలను దాటి భారత దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, భాషా ఐక్యతను ప్రమోటు చేస్తూ సాగుతున్న ఈ యాత్ర, సేజ్ అగస్త్య భారత్ యాత్ర లో కీలక భాగమైంది. డిసెంబర్ 2న తమిళనాడు రాష్ట్రంలోని తెంకాసి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర, డిసెంబర్ 10న కాశీ చేరుకోనుంది. మొత్తం 2,460 కి.మీ దూరంలో, 1520 కార్లు, దాదాపు 100 మంది పాల్గొనేవారు ఈ ర్యాలీలో భాగంగా ప్రయాణిస్తున్నారు.
ఈ యాత్ర పురాతన పాండ్య రాజు ఆది వీర పరాక్రమ పాండ్యన్ వారసత్వాన్ని కూడా స్మరించుకుంటోంది. చెర, చోళ, పాండ్య, పల్లవ, చాళుక్య, విజయనగర సామ్రాజ్యాల నాగరికతల అను సంధానాలను వెలుగులోకి తేవడంతో పాటు, సాంప్రదాయ తమిళ సాహిత్యం, సిద్ధ వైద్యం, సంయుక్త వారసత్వ సంప్రదాయాలపై అవగాహనను పెంపొందిస్తోంది.