calender_icon.png 7 December, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలి

07-12-2025 01:26:24 AM

-రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి 

-రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

-కేంద్ర మంత్రి సంజయ్‌కి ‘గ్లోబల్ సమ్మిట్’ ఆహ్వానపత్రిక అందజేత

కరీంనగర్, డిసెంబర్ 6 (విజయ క్రాంతి): రాజకీయాలకతీతంగా అన్ని పార్టీ లు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని  చైతన్యపురి మహాశక్తి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.సందర్భంగా మంత్రి పొన్నం మాట్లా డుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మిషన్ తెలంగాణ 2047కి సంబం ధించిన గ్లోబల్ సబ్మిట్ ఈ నెల 8, 9న రెండు రోజుల పాటు జరుగుతుందన్నారు.

దేశ ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల సీఎంలను, కేంద్ర మంత్రులను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఆహ్వానం అందించామని తెలిపారు. తెలంగాణ కూడా దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని, 3 ట్రిలియన్ టార్గెట్ చేసుకొని ముందుకు పోవాలని ప్రభుత్వం ఆశిస్తోందన్నారు.ఫ్యూ చర్స్ సిటీతో పాటు అన్ని రంగాల్లో సమగ్ర వృద్ధికి సంబంధించిన ప్రణాళికలతో ముందుకు వెళ్లే సందర్భంలో అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులను కలిసి ఆహ్వానం అందించామని మంత్రి పొన్నం తెలిపారు.2047 డాక్యుమెంట్ వాస్తవానికి దగ్గరగా ఉండేలా, అందరం కలిసి ఐక్యంగా కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తూ, మంత్రులందరూ భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.గతంలో కేంద్ర సహకారం అవసరం లేదనుకున్న ధోరణికి భిన్నంగా, ఇప్పుడు రాష్ట్రం, దేశం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.