03-07-2025 12:00:00 AM
ఆమనగల్లు, జూలై 2: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హయంలోనే కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ అన్నారు. బుధవారం ఆమనగల్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ విద్యావేత్త ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఒక లక్ష్యంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాజకీయంగా అరంగేట్రం చేశారని ఆయన గుర్తు.
గత తొమ్మిది ఏళ్లుగా ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా రాత్రి,పగలు కాలుకు బల్పం కట్టుకొని ప్రజల కోసం శ్రమిస్తున్న నాయకుడని ఆయన పై ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి కొందరు బిఆర్‌ఎస్ నాయకులు కళ్ళు మండుతున్నాయనే... కుట్రపూరితంగా ఎమ్మెల్యే పై పని గట్టుకొని దుష్ప్రచారం కు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 40 ఏళ్ల కల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ను సహకారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రైతుల పొలాల్లో సాగునీరు ను నియోజకవర్గంలో పారించేందుకు వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం రూ. 600 కోట్ల నిధులను తీసుకొచ్చారని... మరో 400 కోట్ల అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉండాలనే దృఢ సంకల్పంతో ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీలో విద్య, వైద్యం, ఉపాధి పరిశ్రమల కోసం, రోడ్లు మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యే అని నిత్యం పరితపిస్తున్నాడని చెప్పారు. ఇటీవలనే నియోజకవర్గంలో తలకొండపల్లిలో రూ.200 కోట్ల నిధులు తీసుకొచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో శంకుస్థాపన చేయించారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర రాజధాని కి కూత వేటు ఉన్న అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే... ఇక్కడ మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించిన టిఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్యేల పనితీరు పై సర్వే అంటూ ఫేక్ వార్తలను నియోజకవర్గంలో సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పై ఎన్ని విమర్శలు చేసిన అభివృద్ధిలో కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే పైన అసత్యాలు ప్రచారం చేస్తున్న టిఆర్‌ఎస్ నేతలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు క్షేత్రస్థాయిలో ఓటు ద్వారానే బుద్ధి చెప్తారన్నారన్నారు.