calender_icon.png 7 July, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

03-07-2025 12:00:00 AM

సీడీపీఓ స్వాతి, ప్రజ్వల సీనియర్ కో-ఆర్డినేటర్ సురేష్ కుమార్ 

ఘట్ కేసర్, జూలై 2 : మనుషుల అక్రమ రవాణా నిర్ములనలో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అని అల్వాల్ సీడీపీఓ స్వాతి అ న్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అల్వాల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోచారం మున్సిపల్ అన్నోజిగూడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సీడీపీఓ స్వాతి హాజరై జ్యోతి ప్ర జ్వలన చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అన్నారు.

దీనికి పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా గుర వుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో ప్రజలతో సన్నిహితంగా ఉండే అంగన్వాడీ టీచర్లు వారి ఆర్థిక సామజిక స్థితి గతులను గమనించి వారికి అవగాహనా కల్పించాలన్నారు. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉప యోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలి అని అన్నారు.

ప్రజ్వల సీనియర్ కో-ఆర్డినేటర్ (తెలంగాణస్టేట్) సురేష్ కుమార్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించు కోవచ్చన్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవా ర్డు గ్రహిత డాక్టర్ సునీత కృష్ణన్ సంబంధిత ఐసిడిఎస్, డి.ఆర్.డి.ఎ, పోలీస్, జుడీసీఎల్, ఎడ్యుకేషన్, డిపార్ట్ మెంట్ ల సహకారంతో పని చేస్తుందన్నారు. ఈశిక్షణ కార్యక్రమంలో సూపర్ వైజర్ సత్తమ్మ, ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్సినేటర్ అంబర్ సింగ్, మితాళి రాజ్ మరియు భూపాల్ అల్వాల్ ప్రాజెక్ట్ నుండి అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.