03-07-2025 12:00:00 AM
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 2: లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహా అన్నారు. ఈ నెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మె సందర్భంగా బుధవారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ మెడికల్ ఆఫీసర్ లక్ష్మీకి సమ్మె నోటీసులు అందజేశారు. అనంతరం సీఐటీయూ నర్సింహా మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. లేబర్ కోడ్‌ల తీసుకొచ్చి.. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తుందని ధ్వజమెత్తారు. కార్మికులకు ప్రాణత్యాగం చేసి 8 గంటల పని రోజులు సాధించుకుంటే.. 12 గంటలు చేయాలని చూస్తుందని విమర్శించారు. లేబర్ కోడ్‌లతో కార్మికులు హక్కులను కోల్పోతారన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు.
నాలుగు లేబర్ కోడ్‌లను ఎత్తివేసి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి.. కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 9న దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు, పారిశ్రా మిక కార్మికులందరూ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు ఎలకపల్లి మహేశ్, ఆశ వర్కర్లు, రమాదేవి, యమునా, స్వరాజ్యం సుహాసిని,తదితరులుపాల్గొన్నారు.