15 March, 2026 | 11:51 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

పోలీసుల అదుపులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

22-04-2025 12:32 AM

 ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు

 ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్,: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌కు వచ్చిన రాజశేఖర్‌రెడ్డిని సోమవారం ఎయిర్‌పోర్టు బయట సిట్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నప్పటికీ అనుమానం వ్యక్తం చేసిన సిట్ తమ వెంట రావాల్సిందేనంటూ బలవంతంగా వాహనం ఎక్కించి విజయవాడకు తరలించారు. మరోవైపు ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. తదుపరి విచారణను  వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం విచారణకు హాజరవుతానని ఆడియో సందేశాన్ని విడుదల చేసిన కాసేపటికే ఏపీ సిట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.