14 July, 2026 | 3:24 PM

Breaking News

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •  

కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కుక్కల్లా అరుస్తున్న విద్యార్థినిలు..

25-10-2024 12:40 PM

జహీరాబాద్, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 15 మంది విద్యార్థులు కుక్కల్లా అరుస్తూ తీవ్ర అనారోగ్యాల గురయ్యారు. శుక్రవారం చికిత్స కోసం జహీరాబాద్ ఏరియా దవాఖానకు తీసుకురాగా విద్యార్థులు కుక్కల్లా అరుస్తూ ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గత రెండు మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యాల గురై కుక్కల అరవడం చేస్తున్నారని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థులను అనారోగ్యాల గురికావడంతో కేజీబీవీ పాఠశాల సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకపోగా అక్కడ చికిత్సలు చేశారు.

పరిస్థితి విషమించడంతో 11 మంది విద్యార్థినిలను జహీరాబాద్ ఏరియా దవాఖానకు తీసుకురావడం జరిగింది. తీవ్రంగా దగ్గడంతో పాటు కుక్కల అరవడం చేయడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో సరైన ఆహారం, నీరు సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు అనారోగ్యాలకు గురికావడం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు తగు విచారణ చేసి విద్యార్థినిలకు పౌష్టికాహారం అందించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.