8 July, 2026 | 8:23 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

ఇంటర్ ఫలితాల్లో కాటారం కేజీబీవీ టాప్

22-04-2025 09:49 PM

కాటారం (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు టాపర్ లుగా నిలిచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపునకు చెందిన ఇరువురు విద్యార్థులు వరుసగా వి అశ్విత 455, పి మల్లికా 431 మార్కులు కైవసం చేసుకున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపునకు చెందిన డి అంజలి 844 మార్కులు సంపాదించుకోగా, బైపిసి గ్రూపునకు చెందిన కే సంధ్య 801 మార్కులు కైవసం చేసుకుని టాపర్లుగా నిలిచారని కేజీబీవీ ప్రత్యేక అధికారిని చల్ల సునీత తెలిపారు. కేజీబీవీ విద్యార్థుల విజయకేతనం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.