28 July, 2026 | 5:29 PM

నన్ను క్షమించండి.. సిట్ ముందు హాజరవుతా : ప్రజ్వల్ రేవణ్ణ

27-05-2024 09:34 PM

న్యూఢిల్లీ: లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసలు నిందితుడు ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు స్పందించాడు. ఈనెల 31 ఉదయం 11 గంటలకు సిట్ విచరణకు హాజరవుతానన్ని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ సేల్సీ వీడియోను విడుదల చేశారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని సిట్ విచరణకు సహకరిస్తానిని చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీ ఎన్నికల ముందు వరకు తనపై ఎలాంటి కేసు లేదన్నా ప్రజ్వల్ రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసు పెట్టిన్నట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విదేశీ పర్యటనకు వెళ్లినట్టు ఆయన వెల్లడించారు. పర్యటన మధ్యలో ఉన్నప్పుడే తనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. రాహుల్ గాంధీతో పాటు, కాంగ్రెస్ అగ్రనేతలు రాజకీయ కుట్రలో భాగంగానే తనపై లైంగిక ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఎక్కడ ఉన్నానో చెప్పనందుకు కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ రేవణ్ణ క్షమపణలు చెప్పారు. లైంగిక దౌర్జన్యంపై కర్ణాటక రాష్ట్ర మహిళ కమీషన్ ఫిర్యాదుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వికెసి నేతృత్వంలో  సిట్ ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ  లైంగిక ఆరోపణలు రావడంపై ఇప్పటికే  జేడీఎస్ పార్టీ సప్సెండ్ చేసింది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణను భారత్ తీసుకొచ్చేందుకు సిట్ కూడా యత్నిస్తుంది.