6 April, 2026 | 5:23 PM

గురుకులంలో కాయకల్ప అవగాహన కార్యక్రమం

06-04-2026 03:20 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాలలో సోమవారం స్వచ్ఛభారత అభియాన్ లో భాగంగా కాయకల్ప అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి సీహెచ్సీ ఆధ్వర్యంలో జరిగిన కాయకల్ప అవగాహన కార్యక్రమంలో డాక్టర్ స్వరూప రాణి ఫిజియోథెరపిస్ట్ మాట్లాడుతూ మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాలించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా  ఉండచ్చన్నారు.

చేతులను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో బెల్లంపల్లి ఏఎన్ఎం శిక్షణ విద్యార్థులు నృత్యం ద్వారా చూపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ వైద్యులు చెప్పిన సూచనలు పాటించాలన్నారు. విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సిహెచ్ నర్సింగ్ ఆఫీసర్లు పైమా, మమత ,హెడ్ నర్స్ లు షీలా , స్టెల్లా తదితరులు పాల్గొన్నారు.