calender_icon.png 18 February, 2026 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 08:56:57 PM

శ్రీరంగాపురం: శ్రీరంగాపురం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు నేతృత్వం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు సింగల్ విండో అధ్యక్షులు జగన్నాథం నాయుడు మాట్లాడుతూ... కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. మండల కేంద్రంలోని  అంబేద్కర్ విగ్రహం దగ్గర కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లో కేసీఆర్ పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించారని,నీళ్లు–నిధులు–నియామకాల నినాదంతో ప్రజలను ఏకం చేశారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.