ఐలాపూర్ లో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
07-12-2024 10:38 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోనీ ఐలాపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ యువ నేత మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ను పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఆదర్శ్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని ఏర్పాటు చేసిన మాణిక్ యాదవ్ ను అభినందించారు. కేసీఆర్ ట్రోఫీ టోర్నమెంట్లో పాల్గొన్న జట్టు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీల ద్వారా క్రీడాకారుల్లో దాగిన ప్రతిభ పదిమందికి తెలుస్తుందన్నారు. క్రీడలతో శారీరక ఎక్ససైజ్ మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య యాదవ్, శ్రీనివాస్, బీఆర్ఎస్ శ్రేణులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




