23-08-2025 12:53:55 AM
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ ను థర్డ్‌క్లాస్ పార్టీ అంటున్న కేటీఆర్.. మీ అయ్య కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారనే విషయం తెలుసుకోవాలి’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండి ప డ్డారు. కేసీఆర్ థర్డ్‌క్లాస్ అయితే.. మరి కేటీఆర్ ఏ క్లాస్ అవుతాడో చెప్పాలని నిలదీశారు.
శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాక సోనియా, రాహుల్‌గాంధీని మీ కుటుంబం అంతా వెళ్లి కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ థర్డ్‌క్లాస్ అని తెలియాదా అని ఫైర్ అయ్యారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే అమెరికాలో జీతం మీద బతికేవాడని, కేటీఆర్‌కు పొలిటికల్ మెచ్యూరిటీ లేదన్నా రు.
కిషన్‌రెడ్డి స్క్రిప్ట్ రీడర్
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంచి వ్యక్తేనని , కానీ కేంద్రమంత్రి అయ్యాక స్క్రిప్ట్ రీడర్ అయ్యారని వి మర్శిచారు. యూరి యా ఇవ్వాల్సింది కేం ద్రమేనని, అయితే రా ష్ట్ర ప్రభుత్వాన్ని బ ద్నాం చేయాలని చూ డటం సరికాదని హిత వు పలికారు. రైతులకు వేల కోట్లు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. యూరియాను రైతులకు ఇవ్వకుండా ఉంటాడా అని తెలిపారు. రైతుల విషయంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పవద్దన్నారు.
దందాల కోసం రివ్యూ చేయలేదు
‘నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మొ గోడినే. బీఆర్‌ఎస్ వాళ్ల తరహాలో దందాల కోసం సచివాలయంలో సమీక్ష చేయలేదు. సంగారెడ్డి ప్రజల మం జీరా నీళ్ల కోసం సమీక్ష చేశాను.. మళ్లీ చేస్తాను’ అని జగ్గారెడ్డి తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణ బిడ్డ జస్టి స్ సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్ మద్దతుగా ఉండాలన్నారు.