calender_icon.png 23 August, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ పథకం నిరుపేదలకు వరం

23-08-2025 12:53:55 AM

డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానంద చార్యులు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఆగస్టు 22: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు,హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానంద చార్యులు అన్నారు.భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన మేడెబోయిన మౌనిక శంకర్ కు రూ.58వేలు,భూపతి పూజ సతీష్ కు రూ.15వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శుక్రవారం గ్రామంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రతి సంవత్సరం సుమారు రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు అవుతూ నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుందని అన్నారు.పార్టీలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్ పథకం ఇవ్వడం హర్షించదగ్గ విషయమని చెప్పారు.ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు నిధులు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష,ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, నర్సింగ శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపాక సత్యం,శిగ నసీర్ గౌడ్,అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్లు బీరెల్లి శ్రీధర్ రెడ్డి,జెర్రిపోతుల సోమయ్య,గ్రామశాఖ అధ్యక్షుడు వేములకొండ ఉప్పలయ్య,కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.