calender_icon.png 23 August, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లోనే: ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్

23-08-2025 11:30:20 AM

ఘట్ కేసర్: పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్(Former Chairman of Ghatkesar Municipal Corporation) ముల్లి పావని జంగయ్యయాదవ్ అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై వేస్తున్న బిటి రోడ్డు పనులను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తు పనుల వల్ల దుమ్ము దూలితో ప్రజలకు తీవ్రఇబ్బందిగా ఉండటంతో హెచ్ఆర్ డి సి అధికారులకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరడంతో కోడి పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ  రోడ్డు పై ప్రయాణించే వాహనదారులకు, పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జెర్మనీ టెక్నాలజీతో  జరుగుతున్న రోడ్డు పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపోల్ల మల్లేష్, మాజీ వార్డు సభ్యులు బర్ల  దేవేందర్ ముదిరాజ్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులుయాదవ్,    పాల్గొన్నారు.