23-08-2025 12:52:44 AM
చేవెళ్ల, ఆగస్టు 22:బీజాపూర్ హైవే పనులు వేగవంతం అయ్యాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చేవెళ్ల పరిధిలోని జరుగుతున్న బై పాస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మర్రి చెట్ల కారణంగా ఆగిపోయిన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలో మీటర్ల రోడ్డుకు అడ్డంకులు తొలిగి పోయాయని చెప్పారు. ఎన్జీటీలో కేసు వేసిన పర్యావరణ వేత్తలు విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించారని వెల్లడించారు. ఈ రోడ్డును ప్రభుత్వం రూ.1050 కోట్లతో నిర్మిస్తోందని, త్వరలోనే మెయిన్ రోడ్డు పనులు కూడా ప్రారంభం అవుతాయన్నారు. అదేవిధంగా మన్నెగూడ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు రావులపల్లి వరకు రూ.1000 కోట్లతో నాలుగు లేన్ల రహదారి మంజూరైందనితెలిపారు.