23-08-2025 11:11:56 AM
ఖాళీ బిందెలతో నిరసన
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ఎస్సీమాల,ఎస్సీమాదిగ కాలనీ,సినిమా టాకీస్ కాలనీలలో గత సంవత్సర కాలంగా త్రాగునీటి సమస్య తలెత్తుతుందని,నీటి సమస్యను పరిష్కరించడం కోసం అధికారులు తాత్కాలిక పనులు చేస్తున్నారే తప్పా... శాశ్వత పరిష్కారం చూపడం లేదు.దీంతో విస్తుపోయిన గ్రామస్తులు త్రాగునీటి కోసం శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేశారు.సమస్య తీర్చడం కోసం అప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.కానీ పూర్తిస్థాయిలో సమస్య పరిష్కరించడం లేదు.
ఇట్టి సమస్య తీరాలి అంటే గ్రామంలో కొత్తగా రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలి.దానితో పాటు తక్షణమే గ్రామంలో అన్ని బజార్లకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.ఎస్సీ కాలనీవాసుల నీటి సమస్యను తక్షణమే కలెక్టర్,ఎంపీడీఓ పరిష్కరించాలని లేనియెడల అధికారుల కార్యాలయాల ముందు కాళీ బిందెలతో పెద్దఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్ గ్రామస్తులు పగిడిమర్రి శ్రీరాములు,గండమల్ల ఎల్లయ్య,మండల ప్రవీణ్,కట్ల సైదులు,నిమ్మల వెంకన్న,లక్ష్మి,హేమలత,సైదమ్మ,ప్రమోద్,సంధ్య తదితరులు పాల్గొన్నారు.