10 July, 2026 | 2:06 AM

ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

10-07-2026 12:00 AM

టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ 

ఎల్బీనగర్, జూలై 9 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేపై అవగాహన పెంచుకుని అర్హులైనవారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ సూచించారు. మన్సూరాబాద్ డివిజన్ లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. మన్సూరాబాద్ భవానీనగర్ కాలనీలో  ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని  పరిశీలించి, బీఎల్వో, బీఎల్‌ఏలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ గురించి అవగాహన కల్పించుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. 2002 ఓటరు జాబితా అనుగుణంగా ఓట్లను సరిచూసుకోవాలని అప్పటి తల్లిదండ్రులు వారసత్వ ఓటును వివరాలను తెలియజేస్తూ ఎస్‌ఐఆర్లో నూతన ఓటుగా నమోదు చేసుకోవాలని సూచించారు. 

కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బుడ్డా సత్యనారాయణ, లింగాల కిశోర్, బద్దుల వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, కొల్లూరు శ్రీనాథ్, రాజేశ్వరి, భాను, రజిని రావు, దాము మహేందర్ యాదవ్, బాలకృష్ణ యాదవ్, విద్యా రెడ్డి, చర్ల రమేశ్, కొండోజు శ్రీనివాస్, వినయ్ పటేల్, రవి తదితరులు పాల్గొన్నారు.