27 March, 2026 | 4:23 AM

రాజేంద్రనగర్‌ను ఒకే కమిషనరేట్ పరిధిలో ఉంచండి

27-03-2026 02:42 AM

అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్ మార్చి 26 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ఫ్యూచర్ సిటీ లేదా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఉంచాలని రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే ప్రకాష్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీలో ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల నూతనంగా జిహెచ్‌ఎంసి పునర్వ్యవస్థీకరణలో భాగంగా  ఏర్పాటు చేసిన జోనల్ కమిషనర్ పరిధిలో మూడు డివిజన్లలో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని విలీనం చేయడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు.

సైబరాబాద్, హైదరాబాద్ మరియు ఫ్యూచర్ సిటీలుగా మూడు వేర్వేరు విభాగాలుగా విభజించడంపై ఎమ్మె ల్యే అభ్యంతరం  వ్యక్తం చేశారు. పాలనాపరమైన ఇబ్బందులు, నియోజకవర్గం మూడు వేర్వేరు కమిషనరేట్ పరిధిలోకి ఉండటం వల్ల  సామాన్య ప్రజలు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకువచ్చా రు.

ఒకే నియోజకవర్గం వేర్వేరు జోన్లలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు మరియు పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయం లోపిస్తోందని పేర్కొన్నారు. ఏదైనా సమస్యపై  అధికారికి ఫోన్ చేస్తే తమ పరిధిలోకి రాదు అంటూ సమాధానం చెబుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నా రు ప్రజల సౌకర్యార్థం రాజేంద్రనగర్ మొత్తం  నియోజకవర్గాన్ని పూర్తిగా సైబరాబాద్ లేదా ఫ్యూచర్ సిటీ  పరిధిలోకి తీసుకు వచ్చి, ఒకే కమిషనరేట్ కింద ఉంచాలని ప్రభుత్వాన్ని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.