13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బీసీల సమస్యలు పరిష్కరించాలి

27-03-2026 02:42 AM

తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు బీసీ సంఘాల వినతి

హనుమకొండ టౌన్, మార్చి 26 (విజయక్రాంతి): బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు బీసీ సంఘాల వినతి పత్రం అందించారు.

గురువారం ఎన్పీడీసీఎల్ గెస్ట్ హౌస్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్, బీసీ జాక్ చైర్మన్ తిరునహరి శేషు, ధారబోయిన సతీష్ ముదిరాజ్ ల బృందం తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యుల బృందమును మర్యాదపూర్వకంగా కలిసి, బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిసి విద్యార్థులకు ర్యాంక్ తో సంబంధం లేకుండా రియంబర్స్మెంట్ పై ఆంక్షలు ఎత్తివేసి, మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన, సంచార జాతుల సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వారికి తగిన బడ్జెట్ ను కేటాయించడంతోపాటు, పలు డిమాండ్లను పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.