రేపే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
23-06-2024 08:36 PM
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బోర్డు సోమవారం విడుదల చేయనుంది. ఇప్పటికే సమాధాన పత్రాల ముల్యాంకనం ప్రక్రియ కూడా బోర్డు పూర్తి చేసింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మే 24వ తేదీ నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు మార్కులు ఇంప్రూవ్ మెంట్ కోసం రాసిన విద్యార్థులు సైతం ఉన్నారు.






