27 July, 2026 | 9:48 PM

కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

29-05-2024 12:15 AM

న్యూఢిల్లీ, మే 28: అనారోగ్య కారణాల రీత్యా తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన అత్యవసర విచారణ పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్ ఆశలు అడియాశలయ్యాయి. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అందుకు అంగీకరించి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ నిబంధన ప్రకారం కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మాత్రమే బయట ఉండే అవకాశం ఉంది. 2వ తేదీన తిరిగి తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉన్నది.