13 June, 2026 | 2:15 AM

మహిళా జడ్జికి రూ.52 లక్షలు బురిడీ

13-06-2026 12:00 AM
  1. తన పనిమనిషితో ఫిర్యాదు చేయించిన న్యాయమూర్తి
  2. నిందితుడి అరెస్ట్, టిండర్ యాప్‌పై పోలీసుల ఆరా

చండీగఢ్, జూన్ 12 (విజయక్రాంతి): ఓ మోసగాడి వలలో చిక్కుకున్న ఓ మహిళా న్యాయమూర్తి ఏకంగా రూ.52 లక్షలు మోసపోయారు. టిండర్ అనే యాప్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి ఆమెకు అనతికాలంలోనే ఫోన్‌లో దగ్గరై, ఈ మోసానికి ఒడి గట్టిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అయితే తన ఇంట్లో పనిమనిషితో సదరు న్యాయమూర్తి పోలీలకు ఫిర్యాదు చే యించారు. హరియాణాకు చెందిన మహిళా న్యాయమూర్తికి గతేడాది నవంబర్‌లో టిం డర్ యాప్ ద్వారా అభిమన్యు వశిష్ట్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

కొద్దికాలం అనంతరం పెట్టుబడులు పెడితే అధిక లాభా లు వస్తాయని న్యాయమూర్తిని నమ్మించాడు. దీంతో ఆమె రూ.52 లక్షలు అతనికి బదిలీ చేసింది. ఎన్నాళ్లయినా పెట్టిన పెట్టుబడికి లాభాలు రాకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించి, దీనిపై తన ఇంట్లో పనిమనిషితో పోలీసులకు ఫిర్యాదు చేయించింది.

దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కేసు విచారణ సందర్భం గా ఈ యాప్‌లో ఈ ఇద్ద రి మధ్య సాగిన చాటింగ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.