11 August, 2026 | 1:49 AM

కాంగ్రెస్‌లో చేరిన కీలక నాయకులు

11-08-2026 12:00 AM

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

భూత్పూర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో బిజెపి టిఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన బీజేపీ మహబూబ్నగర్ జిల్లా ఎస్టి మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్‌ఎస్ యువనాయకుడు కాట్రవత్ ఆనంద్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భూత్పూర్ మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నాగిరెడ్డి, తదితర కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.