calender_icon.png 23 August, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాల్ చిత్రంలో కీ రోల్

23-08-2025 12:25:48 AM

హీరో విశాల్ చివరగా ‘మదగదరాజ’ తో అలరించా రు. అందులో హీరోయిన్లు అంజలి, వర లక్ష్మీశరత్‌కుమా ర్‌లతో కలిసి అలరించారాయన. ఇప్పుడు తన 35వ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాలో అంజలి భాగమైంది. మేకింగ్ టైటిల్ ‘విశాల్35’తో ప్రచారంలో ఈ ప్రాజెక్టును టాలీవుడ్ నిర్మాత ఆర్‌బీ చౌదరి సొంత బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ‘విశాల్ 35’ ప్రాజెక్టును ఓకే చేసిందీ ముద్దుగుమ్మ. ఈ మేరకు ‘విశాల్ 35’లో అంజలి కీలక పాత్ర పోషించనుందని టీమ్ వెల్లడించారు. రవి అరసు దర్శకుడు. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. విశాల్ సరసన కథానాయికగా దుషార విజయన్ నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్; డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్; ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్; ఆర్ట్: దురైరాజ్.