23-08-2025 12:22:03 AM
అగ్ర నటుడు చిరంజీవి జన్మదిన వేడుకలను శుక్రవారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాల్లోని ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ ఫొటోస్ స్కెచెస్‌ను విజయవాడకు చెందిన ఆర్టిస్ట్ బాలకృష్ణ, ఆయన కూతురు సాయిశ్రీ, కుటుంబ సభ్యులు డిజైన్ చేశారు. దాదాపు 160 సినిమాల్లోని స్కెచెస్ పెన్సిల్స్‌తో సుమారు 70 చిత్రాలను గీశారు.
ఈ బొమ్మలు చూస్తుంటే ఆయా సినిమాలతో ఉన్న అనుబంధం, తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని సందర్శకులు అన్నారు. ఈ చిత్రాలన్నీ చిరంజీవి ఇంట్లో అమర్చితే బాగుంటుదని అభిప్రాయపడ్డారు. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, దర్శకుడు బీ గోపాల్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ, ఫిలింనగర్ కల్చర్ సెంటర్ కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, ఎఫ్‌ఎన్‌సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, ట్రెజరర్ శైలజ, కమిటీ మెంబర్లు, సినీప్రముఖులు పాల్గొన్నారు.