calender_icon.png 28 July, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4.5 కిలోల గంజాయి స్వాధీనం

28-07-2025 01:29:56 AM

నలుగురి అరెస్టు, పరారీలో ఇద్దరు

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు డ్రై గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని ముషీరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్న నలుగు రిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. రెండు లక్షల 24 వేల 100 విలువ గల 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సెంట్రల్ జోన్ డీసీపీ కే. శిల్పవల్లి, చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ పర్యవేక్షణలో ముషీరాబాద్‌లోని ముస్లిం స్మశాన వాటిక వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పిసి నరేష్, ధనుంజయ్ (హెచ్‌జీ) క్రైమ్ సిబ్బంది ఉదయ్, కార్తీక్ శ్రీనివాస్ సహకారంతో నలుగురి గాంజా విక్రేతలను పట్టుకొని వారి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్‌లను, 4.5 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్న ట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా పద్మశాలి  టౌన్షిప్ కు చెందిన సిపి శేఖర్ సుమన్, ముషీరాబాద్ బాపూజీ నగర్‌కు చెందిన కాలేరు విహాన్, పాత అల్వాల్ సిటిజన్ కాలనీకి చెందిన ఉద్దాది సాయి విలాస్, ముషీరాబాద్ రాంనగర్ కు చెందిన సంతోష్ లను  పట్టుకోగా, ఏపీకి చెందిన వినోద్ అనే వ్యక్తి తో పాటు మరొకరు పరారీలో ఉన్నట్లు ముషీరాబాద్ ఇన్స్పె క్టర్ రాంబాబు తెలిపారు.