28-07-2025 01:28:40 AM
రాష్ట్ర ఆఫ్ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పలు గురు కులాలు, పాఠశాలల్లో ఆహార విషపూరిత (ఫుడ్ పాయిజన్), ఆత్మహత్యలు, అనుమానాస్పద పరిణామాల వల్ల విద్యార్థులు ప్రా ణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో 2024 డిసెంబరులో మంచిర్యాల జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి నయీమ్ పాషా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కి ఫిర్యాదు
చేయగా, కమిషన్ విచారణకు స్వీకరించి ఈ నెల 28 న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్‌లో ఓపెన్ కోర్టు హియరింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించినట్లు ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న (సోమవారం) జరిగే విచారణలో రాష్ట్రంలోని ప్రజా సంఘాలు,
మానవ హక్కుల సంఘా లు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు పాల్గొనాలని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై వెలుగులోకి రాని నిజాలను నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందానికి తెలియజేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కన్వీనర్ బుర్ర రాము గౌడ్, రాష్ట్ర ప్రతినిధి జావిద్, మంచిర్యాల, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జులు నయీం పాషా, శ్రీనివాస్, మంచిర్యాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కొంటూ రాజేందర్శి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.