calender_icon.png 21 February, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2.7 కిలోల ఓపీఎం డ్రగ్స్ పట్టివేత

21-02-2026 12:00:00 AM

  1. ముగ్గురు నిందితుల అరెస్టు

అమీన్‌పూర్‌లో ఘటన 

అమీన్‌పూర్, ఫిబ్రవరి 20: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని శేరిలింగంపల్లి ఎస్వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమీన్‌పూర్‌లో రాజస్థాన్‌కు చెందిన మార్వాడీ హేతారం అనే వ్యక్తి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు శేరిలింగంపల్లి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఓ మార్బుల్ దుకాణంలో అక్రమంగా నిల్వవుంచిన 2.7 కిలోల ఓపిఎం డ్రగ్స్, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.14 లక్షల విలువైన ఓపిఎం డ్రగ్స్‌ను రాజస్థాన్ నుంచి తెచ్చి అమీన్‌పూర్‌లో విక్రయిస్తున్న హేతారంతో పాటు ఇద్దరు కొనుగోలుదారులను అరెస్టు చేశారు.