15 August, 2026 | 9:02 PM

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహా ఏర్పాట్లు షురూ.. ఈ ఏడాది ఎత్తు ఎంతో తెలుసా?

17-06-2024 06:13 PM

హైదరాబాద్ : నగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినాయక చవితి మరో మూడు నెలల్లో రానుంది. ఈ నేపథ్యం ఖైరతాబాద్ లో వినాయక విగ్రహ తయారీ పనులు మొదలయ్యాయి. గణపతి విగ్రహ ఏర్పాటు కోసం ఖైరతాబాద్ గణేశ్ మండలి సోమవారం కర్ర పూజ నిర్వహించింది. దీంతో ఈ ఏడాది 70 అడుగుల విగ్రహాన్ని రూపొందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ మట్టి విగ్రహాన్ని తయారీ నిర్ణయించారు.

ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఎంఎల్ఎ దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాట్లను ప్రారంభించినట్లు చెప్పారు. ఈసారి గణేశ్ ఉత్సవాలను 11 రోజులపాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తామని తెలిపారు. తొలిపూజ గవర్నర్ నిర్వహిస్తారని, ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని దానం నాగేందర్ పేర్కొన్నారు.