calender_icon.png 10 November, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం ఈస్తటిక్స్ సాహిత్య పురస్కారాలు

10-11-2025 12:00:00 AM

-ప్రముఖ కవుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ఖమ్మం ఈస్థటిక్స్ సాహిత్య పురస్కారాల సభ ఆదివారం సాయంత్రం స్థానిక జడ్పీ హాల్‌లో నిర్వహించారు. ఆద్యం తం ఎంతో ఆలోచనాత్మకంగా జరిగిన సభ కు సాహితీవేత్త పి. రవిమారుత్  అధ్యక్షత వహించగా గౌరవ అతిథులుగా డా.ఎల్. ఎస్.ఆర్.ప్రసాద్, ప్రతిమ, వేంపల్లె షరీఫ్, వెల్దండి శ్రీధర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. తెలుగు సాహిత్యంలో కవిత్వానికి, కథలకు విశిష్ట స్థానముందని, దానిని కొనసాగించేందుకు కవులను ప్రోత్సహించేందుకు ఖమ్మం ఈస్థటిక్స్ వారు నిర్వహిస్తున్న పురస్మారాలు ఎంతో అభినందనీయమనారారు.

సభాధ్యక్షులు రవిమారుత్ మాట్లాడుతూ.. సాహిత్య పోటీలకు కథలను, కవిత్వ సంపుటాలను ఆహ్యానించగానే స్పందించిన తెలుగు కవులకు కృతజ్ఞతలు తెలిపారు. 90కి పైగా కవితా సంపుటులు, 140కి పైగా కథలురాగా, కమిటీ అభ్యర్థన మేరకు కవిత్యానికి ముగ్గురు, కథలకు ముగ్గురు న్యాయ నిర్ణేతలంగా వ్యవరించారు. కవిత్వం విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ’లోపలేదో కదులుతున్నట్టు’ 40వేల రూపాయల బహుమతిని గెలుచుకుంది. మరో ఇద్దరికి ప్రత్యేక ప్రశంసగా ప్రోత్సాహక అవార్డులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. రేణుక అయోల కవితా సంపుటి ‘రవిక’, పాయల మరళీ కృష్ణ కవితా సంపుటి ‘గచ్చెం సెట్టుకు అటూ ఇటూ’ ప్రత్యేక ప్రశంసకు అర్హంగా ఎంపికయ్యాయి.

కథల విభాగంలో ఉత్తమ కథగా వి.ఆర్.రాసాని ‘తేనెకల్లు’ 25 వేల రూపాయల బహుమతిని గెలుచుకుంది. ద్వితీయ ఉత్తమ కథగా ఆలూరి అరుణ్ కుమార్ ‘అంజమ్మ’ 15 వేల రూపాయల బహుమతిని, తృతీయ ఉత్తమ కథగా యా ములపల్లి నర్సిరెడ్డి ‘కావలి’ పదివేల రూపాయల బహుమతిని గెలుచుకున్నాయి. బహు మతులు గెలుచుకున్న కథలతో సహా పోటీకి వచ్చిన కథలలో పన్నెండు కథలను ఒక సంపుటిగా ప్రచురించాలని ఖమ్మం ఈస్తటిక్స్ కమిటీ నిర్ణయించిందని వారు వివరిం చారు. ఎం. సుగుణాకర రావు ‘అప్పో దీపోభవ’, సుంకోజు దేవేంద్రాచారి ‘శివుడాజ్ఞ’, ఎం. ప్రగతి ‘ఉంకువ’, సంజయ్ ఖాన్ ‘మూడోకన్ను’, పి.వి.వి. సత్యనారాయణ ‘భాగ్య మతి’, జీ.వి. శ్రీనివాస్, ‘నేలరాలిన పువ్వు’, బి. కళా గోపాల్ ‘ఇష అసంతం’, గుమ్మడి రవీంద్రనాథ్ ‘అనగనగా ఒక హంస’, ఆర్వీ.ర మణ శాస్త్రి ‘అసూయ’ కథలును సంకలనంలో ప్రచురించి పుస్తకావిష్కరణ గావిం చారు.

న్యాయ నిర్ణేతలుగా వ్యవహిరించిన ఆరుగురికి, గౌరవ అతిధులుగా విచ్చేసిన డా. ఎల్.ఎస్.ఆర్.ప్రసాద్, ప్రతిమ, వేంపల్లె షరీఫ్, వెల్దండి శ్రీధర్ లకు ఖమ్మం ఈస్థటిక్స్ కమిటీ సభ్యులు రవిమారుత్, ప్రసేన్, సీతారాం, వంశీ కృష్ణ, మువ్వా శ్రీనివాసరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఫణిమాధవి కన్నోజు కృతజ్ఞతలు తెలియజేశారు.