10-11-2025 12:00:00 AM
-సినీరంగంలో 50 ఏళ్ల ప్రస్థానం
-బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సత్కారం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): సినీ నటుడు సాయికుమార్ సినీరంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ప్రగతి నగర్‌లోని పుచ్చలపల్లి లీలా సుందరయ్య ఫంక్షన్ హాలులో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ కార్తిక సామారాధన మహోత్సవంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. “నా నటనా జీవితం విజయవంతంగా సాగటం మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా ఆనందదాయకం కావటం నాకు పెద్ద వరం.
నన్ను ఇంత ప్రేమ గా గౌరవంగా ఆదరించిన బ్రాహ్మణ ఐక్యవేదికకు మరియు నా అభిమానులకు హృద యపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. “డా. ఏ.వి.ఆర్. మూర్తి ఎన్నో ఏళ్లుగా స్వార్థరహితంగా బ్రాహ్మణ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అన్నదానాలు, పేద కుటుంబాల వివాహాలకు సహాయం వంటి ఎన్నో సేవలు ఆయన చేస్తున్న సేవాభావాన్ని ప్రతిబింబిస్తాయి” అని ప్రశంసించారు. కార్యక్రమంలో నటుడు ఆది సాయి కుమార్, నటి అర్చనా పాల్గొని మాట్లాడారు.
తమ రాబోయే చిత్రం ‘శంభాలా’ ట్రైలర్‌ను ప్రదర్శించడంతో పాటు, కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చే లా నృత్య ప్రదర్శన కూడా చేశారు. డా. పి. శ్వేత బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సామారాధన (పండిత విందు) కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా పి.వి. ప్రభాకర్‌రావు (చైర్మన్, పి.వి. గ్లోబల్ ఫౌండేషన్), కళా వి.ఎస్. జనార్ధన్ మూర్తి (అధ్యక్షు డు, త్యాగరాయ గానసభ) పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రాహ్మణ ఐక్యవే దిక అధ్యక్షుడు డా. ఏ.వి.ఆర్. మూర్తి మాట్లాడుతూ.. “తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళ లను పరిరక్షించే వారిని సన్మానించడం మా బాధ్యత. సాయికుమార్ సినీ సేవలు, విలువలు, వ్యక్తిత్వం మన యువతకు ఆదర్శం” అన్నారు.