6 May, 2026 | 8:23 PM

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

06-05-2026 07:49 PM

* ప్రధాన న్యాయమూర్తిని మర్యాదగా కలిసి సత్కారం

* వేసవికాలం దృష్ట్యా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు దద్దోజనం, పెరుగన్నం పంపిణీకి శ్రీకారం

(ఖమ్మం, విజయ క్రాంతి): జిల్లా ప్రధాన న్యాయస్థానాన్ని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు బుధవారం సందర్శించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీని జిల్లా జడ్జి సత్కరించారు. 

కోర్టుకు వచ్చే కక్షిదారుల కోసం పెరుగన్నం పంపిణీ

 వేసవికాలం తీవ్రమైన ఎండల దృష్ట్యా... జిల్లా ప్రధాన కోర్టుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కక్షిదారుల కోసం రామసహాయం కల్పనా రెడ్డి జ్ఞాపకార్థం ఏప్రిల్ 28న ప్రారంభమైన దద్దోజనం, పెరుగన్నం పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్వయంగా పలువురు కక్షిదారులకు వడ్డించారు. జూన్ ఒకటో తేదీ వరకు నిరంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, కక్షిదారులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. 

సొసైటీ రూమ్ కు..

 సొసైటీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు సొసైటీ రూమ్ ను ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సందర్శించారు.