calender_icon.png 18 February, 2026 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం టీఎన్జీవోస్ డైరీ ఆవిష్కరణ

18-02-2026 01:28:26 AM

ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

ఖమ్మం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా నూతన సంవత్సర డైరీని మంగళవారం హైదరాబాద్లో నాంపల్లిలో గల కేంద్ర సంఘ కార్యాలయంలో ఆవిష్కరించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎమ్.హుస్సేనీ ముజీబ్ ఈ డైరీని విడుదల చేశారు. ఉద్యోగుల స్ఫూర్తికి ఖమ్మం చిరునామాగా నిలిచిందని జగదీశ్వర్ అన్నారు.

ఉద్యోగులకు నిత్యం ఉపయోగపడే సమాచారంతో డైరీని తీర్చిదిద్దిన ఖమ్మం జిల్లా కార్యవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెడ్ ఎస్ జైపాల్, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు కొమరగిరి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి ముజీబ్, కేంద్ర సంఘ కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు  కస్తూరి వెంకటేశ్వర్లు, కేంద్ర సంఘ కార్యదర్శి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.