18-02-2026 01:25:43 AM
ములకలపల్లి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జూపల్లి శశికళ, రమేష్ బాబు దంపతులను ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు సురభి రాజేష్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజే సినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అశ్వారావుపేట మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ హస్తగతం కావటం సంతోషకర విషయమని, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషి ఎంతగానో ఉందని అపూర్వ విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి అందజేసిన అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. వారిని కలిసిన వారిలో అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు సుమిత్, దమ్మపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాకా రమేష్ తదితరులు ఉన్నారు.