29 July, 2026 | 1:18 AM

తెలంగాణ రాష్ట్ర హామీల కమిటీ చైర్మన్‌గా ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

29-07-2026 12:00 AM

నారాయణఖేడ్, జూలై 28: హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ  ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభా హామీల కమిటీ ఛైర్మన్గా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  మంగళవారం ఘనంగా బాధ్యతలు స్వీకరించారు.

కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సంజీవరెడ్డి కి వారు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో హామీల కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికి, స్పీకర్ కు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.