29 July, 2026 | 12:48 AM

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుకు వినతి

29-07-2026 12:00 AM

సాగునీరు విడుదలకు, బిటి రోడ్డు మంజూరుకు హామీ

కోహెడ, జూలై 28: కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామస్తులు, సర్పంచ్ పిల్లి బాబు ఆధ్వర్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును హైదరాబాద్ నివాసంలో కలిశారు. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి గుండారెడ్డిపల్లి ఒగ్గ పాగు చెక్ డ్యాంలోకి రైతులకు సాగునీరు విడుదల చేయాలని.. దర్గాపల్లి నుంచి గుండారెడ్డిపల్లి రహదారి గుంతలతో అద్వానంగా మారిందని.. ఇరు గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని.. బిటి రోడ్డు మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చినట్లు సర్పంచ్ పిల్లి బాబు పేర్కొన్నారు. దింతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించరాని తెలిపారు. కార్యక్రమం లో మాజీ సర్పంచ్ సుతారి కనుకరాజు, నక్క సంజీవ్, కొనవేని కిషన్, పెంకర్ల శేఖర్, పొడిశెట్టి మల్లికార్జున్ పాల్గొన్నారు.