‘ఖేత్ బచావో అభియాన్’
మహబూబాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లక్ష్మీపురంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐపీఎంసీ ఇంచార్జి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించి మట్టిపరీక్ష, పంట మార్పిడి చేసి రసాయన ఎరువులు తగ్గించి భూసారాన్ని కాపాడాలని చెప్పారు.
ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హొన్నప్ప విత్తన శుద్ధి ఉపయోగాలు గురించి ప్రత్యక్షంగా వివరించారు. అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉదయ శంకర్ రైతులు పురుగుమందులు పిచికారి చేసేటప్పుడు, కొనేటప్పుడు, వాడిన తర్వాత పాటించ వలసిన జాగ్రత్తలను వివరించారు. అంతకుముందు జిల్లా వ్యవసాయాధికారి విజయ్ చంద్రను కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారులు కలిశారు. ఈ కార్యక్రమంలో ఏవో కే.రాజు, ఏ ఈ వో పి.రమేష్, స్థానిక సర్పంచ్ బొర్రా కృష్ణ పాల్గొన్నారు.






