5 May, 2026 | 7:08 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

మునగాలలో బాలుడి కిడ్నాప్.. ఆపై హత్య

15-08-2024 12:21 AM
  1. బాలుడి తల్లి వివాహేతర సంబంధమే కారణం? 
  2. వివరాలు వెల్లడించిన డీఎస్పీ సత్యనారాయణ 

గద్వాల (వనపర్తి), ఆగస్టు 14 (విజయక్రాంతి) / అలంపూర్: ఏడేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటిక్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన షేక్ జమీర్, సమీరా బేగం దంపతులు. వారికి కుమారుడు షేక్ రఫీ(7) ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన మౌలాలి(జమీర్ బావ)కి సమీరాతో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. ఆరు నెలల క్రితం మౌలాలి వద్ద షేక్ జమీర్ రూ.రెండు లక్షలు అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వలేదు.

దాంతో పాటు సమీరా బేగం వేరే వ్యక్తితోనే వివాహేతర సంబంధం నడుపుతున్నట్టు తెలుసుకున్న మౌలాలి పలుమార్లు ఆమెను వారించాడు. అయినా ఆమె వినలేదు. ఇదంతా మనసులో పెట్టుకున్న మౌలాలి సమీరాబేగం దంపతుల కుమారుడు షేక్ రఫీ(7)ని మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కిడ్నాప్ చేశాడు. అతడి కోసం వేతికిన తల్లిదండ్రులు అదేరోజు రాత్రి 10 గంటలకు ఇటిక్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మౌలాలిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. దీంతో బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు మౌలాలి తెలిపాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.