19 May, 2026 | 1:28 AM

ఘనంగా కిడ్స్ ఫెస్టివల్ ఆకట్టుకున్న చిన్నారులు

19-05-2026 12:20 AM

మహబూబ్ నగర్ టౌన్ మే 18: జిల్లా కేంద్రంలోని రెమా వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహిస్తోన్నా కిడ్స్ ఫెస్టివల్ లో బాగంగా మొదటిరోజు సోమవారం పాస్టర్ బిఎస్ పరంజ్యోతి అధ్యక్షతన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పాస్టర్ పరంజ్యోతి ప్రసంగిస్తూ, చిన్నారులు తల్లిదండ్రులకు విధేయులుగా రాణిస్తూ దేవునికి ఇష్టులుగా ఉండాలని సూచించారు.

దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణించగలుగుతామని ఈ సందర్భంగా గుర్తు చేశారు అనంతరం బైబిల్ పై అవగాహన కల్పిస్తూ వారిని ఉత్తేజపరిచారు, మొదటి రోజు ప్రత్యేక బృందాలతో చిన్నారులకు స్కిట్స్, కొరియోగ్రాఫర్ తోపాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించడంతో వారంతా ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో పీటర్ సన్, అభిషేక్, కళ్యాణ్, జాన్, ధీరజ్, జోనా, స్వరణ్ రాజ్ లతో పాటు అధిక సంఖ్యలో చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.