02-02-2026 12:00:00 AM
సికింద్రాబాద్ ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం తో సీఎం రేవంత్ రెడ్డి కుట్ర తో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బిఆర్‌ఎస్ యువజన నాయకుడు బి.సాయికిరణ్ అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అక్రమ కేసులపై సిట్ విచారణ నేపథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గ అన్నా నగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బోయిన్ పల్లి మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్,బిఆర్‌ఎస్ యువజన నాయకుడు బి.సాయికిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ సభ్యుడు దేవులపల్లి శ్రీనివాస్. వార్డు అధ్యక్షుడు కుమార్, ఉద్యమ కారులు కట్టల్మండి ధనంజయ్, కాంతయ్య, నర్సింహా ముదిరాజ్, నర్సింహా, ప్రకాష్ బాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.