05-10-2025 01:17:19 AM
ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయా లన్న లక్ష్యంతో హాలీవుడ్‌లో నేరుగా రూపొందుతున్న సిని మా ‘కింగ్ బుద్ధ’. ‘ప్రజా యు ద్ధ నౌక’, ‘ఉక్కు సత్యాగ్రహం’ వంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత సత్యారెడ్డి.. ఈ సినిమాతో తొలిసారి హాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్ లాంచ్ ఈవెంట్ టెక్సాస్‌లో నిర్వహించారు.
మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్‌గా పనిచేసిన మ్యాట్ పోవెల్ ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరై, మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్‌తోపాటు సోషల్ వర్కర్స్, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యాట్ పోవెల్ మాట్లాడుతూ.. “గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేశారు.
నా స్నేహితుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు సత్యారెడ్డి ఈ సినిమాను నేరుగా హాలీవుడ్‌లో నిర్మించడం సంతోషకరం” అన్నారు. ‘అతి త్వరలో ఒక ప్రముఖ బౌద్ధారామంలో షూటింగ్ ప్రారంభిస్తాం. ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధమత పెద్దలు, గురువులు, మంక్స్‌లు, బౌద్ధమతంపై రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్లు, బౌద్ధమత అన్వేషకుల సమక్షంలో షూటింగ్ జరుగుతుంది’ అని చిత్ర దర్శకుడు సత్యారెడ్డి తెలిపారు.