calender_icon.png 5 October, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

05-10-2025 01:16:00 AM

పూజిత పొన్నాడ.. ప్రస్తుతం తెలుగు, తమిళ చలనచిత్రాల్లో పనిచేస్తోంది. 1989 అక్టోబర్ 5న విశాఖపట్నంలో జన్మించింది. 2015లో తొలిసారి ‘ఉప్మా తినేసింది’ అనే లఘుచిత్రంలో నటించింది. 2016లో ‘ఊపిరి’ చిత్రంలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2018లో రామ్‌చరణ్ కథానాయకు డిగా వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రియురాలి పాత్రలో కనిపించింది.

ఇందులో పూజిత నటనపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. 2019లో రాజశేఖర్ ‘కల్కి’లో రొమాంటిక్ ఎస్సై పాత్రలో మెప్పించింది. ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘రాజు గాడు’, ‘మిస్ ఇండియా’, ‘రావణాసుర’, ‘ఓదెల రైల్వేస్టేషన్’లోనూ వివిధ పాత్రల్లో నటించిన పూజిత.. ఇటీవల పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందిన ‘హరిహర వీరమల్లు’లోనూ కనిపించింది.