calender_icon.png 5 October, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్లీలతకు తావులేని సినిమా ఇది

05-10-2025 01:18:32 AM

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. సినిమా అక్టోబర్ 10న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. “ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంతవరకు తెలుగులో రాలేదు.

అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమా చేశాం. ఇది ఏ ఒక్కరినీ నిరాశపర్చదు” అన్నారు. హీరోయిన్ కోమలి మాట్లాడుతూ.. “శశివదనే’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను ఇందులో పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. క్ల్లుమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. మా సినిమా కచ్చితంగా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది” అని చెప్పారు. ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజకు, గౌరీకి థాంక్స్’ అని డైరెక్టర్ సాయిమోహన్ తెలిపారు.

నిర్మాత అహితేజ మాట్లాడుతూ.. “శశివదనే’ లాంటి క్లుమైక్స్‌ను తెలుగులో ఇంతవరకు చూడలేదు” అన్నారు. ‘శశివద నే టీమ్ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించింది. అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ అన్నారు. కెమెరామెన్ సాయికుమార్, నటి అంబికా, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.