calender_icon.png 12 September, 2024 | 11:22 PM

ఈ బిల్లుతో ఎవరి హక్కులు తీసివేయడం లేదు

08-08-2024 04:09:55 PM

న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవవరణ బిల్లుపై గురువారం లోక్ సభలో చర్చ జరిగింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా కిరణ్ రిజిజ్ మాట్లాడుతూ.. ఈ బిల్లుకు మత స్వచ్ఛలో జోక్యం లేదని, ఈ బిల్లుతో ఎవరి హక్కులు తీసివేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ముస్లీం మహిళలు, పిల్లలకు ఉపయోగపడుతుందని, వక్ఫ్ బోర్డుల సమాచారాన్ని కంప్యూటరైజ్డ్ చేస్తామని కిరణ్ తెలిపారు.

అణిచివేయబడిన వర్గాలకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని కిరణ్ రిజిజ్ సూచించారు. బిల్లును జాయింటు పార్లమెంటు కమిటీకి పంపుతామన్నారు. సచార్ కమిటీ నివేదిక మేరకు బిల్లును తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బిల్లు విషయమై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపామని, ఇతరుల హక్కులను హరిస్తుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు హక్కులు పొందని వారికి హక్కులు లభిస్తాయని, వక్ఫ్ బోర్డును మాఫియా ఆక్రమించాయని చాలా మంది ఎంపీలు చెప్పారన్నారు.

కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా బిల్లుకు మద్దుతు ఇస్తున్నట్లు చెప్పారని, కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా మద్దుతు ఇవ్వలేమని చెప్పాయి. వక్ఫ్ బోర్డులో వివిధ మతాల సభ్యులుండాలని మేము చెప్పట్లేదని, పార్లమెంట్ సభ్యుడు వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఉండాలంగున్నామని రిజిజ్ చెప్పారు.  ఒకవేళ ఎంపీ హిందూ లేదా క్రిస్టియన్ అయితే ఏం చేస్తామని, ఒక ఎంపీని వక్ఫ్ బోర్డులో చేర్చుకుంటే వారి మతం మార్చాలా..? అన కిరణ్ రిజిజు తెలిపారు. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు తెలపగా, కాంగ్రెస్, టీఎంసీ, ఎంఐఎం, ఎస్పీ పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రాజ్యంగా విరుద్ధంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఖండించింది.